విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటీవల మృతి చెందిన పీసీసీ ఉపాధ్యక్షుడు, జిల్లా మాజీ అధ్యక్షుడు ఆదిరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా పార్టీ కార్యాలయానికి ఆదిరాజు పేరు పెడతామన్నారు.
'రాబోయే రోజుల్లో తెదేపా, వైకాపాకు మనుగడే లేదు' - Congress party at vizianagaram district news update
సీఎం జగన్ కు పరిపాలించడమే రాదని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ విమర్శించారు. విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో తెదేపా, వైకాపాకు మనుగడ లేదని చెప్పారు.

రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజనాథ్ రెడ్డి