ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయనగరంలో కాంగ్రెస్ నేతల సత్యాగ్రహం - విజయనగరంలో కాంగ్రెస్ ఆందోళన

భాజపా ప్రభుత్వం రైతులపై వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా ఉందని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి అన్నారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సత్యాగ్రహం చేపట్టారు.

congress party sathyagraha at vizianagaram
విజయనగరంలో కాంగ్రెస్ నేతల సత్యాగ్రహం

By

Published : Oct 31, 2020, 6:54 PM IST

రైతు హక్కుల దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సత్యాగ్రహం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భాజపా ప్రభుత్వం ఆమోదించిన 3 వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులతో రెండు కోట్ల సంతకాల సేకరణను నిర్వహిస్తున్నామని ఏపీ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి అన్నారు. వైకాపా ప్రభుత్వం, తెదేపాలు రైతు వ్యతిరేక బిల్లులకు మద్దతు ఇవ్వడం దారుణమని విమర్శించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details