'సంతకాలు పెట్టండి, అన్యాయాన్ని ఎదుర్కొండి' అంటూ...ఏపీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ పిలుపునిచ్చారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా... విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.
కరోనా ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా... ప్రధాని మోదీ,సీఎం జగన్ పట్టించుకునే పరిస్థితి లేదని శైలజానాథ్ విమర్శించారు. భాజపా, వైకాపా రెండూ దొందేనంటూ... బయట ఒకరికి ఒకరు తిట్టుకుని, లోలోపల కలిసి తిరుగుతారని ఆరోపణలు చేశారు.