ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'భాజపా విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు' - విజయనగరం

భాజపా విధానాలకు వ్యతిరేకంగా ఈనెల ఆగస్టు 9న 'సేవ్ ఇండియా' నినాదంతో విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ పిలుపునిచ్చారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన ఈ ఏడేళ్లలో ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేటుపరం చేసిందని అన్నారు.

Aituc
ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్

By

Published : Jul 31, 2021, 5:26 PM IST

కేంద్రంలోని భాజపా విధానాలకు వ్యతిరేకంగా 'క్విట్ ఇండియా' స్ఫూర్తితో ఈ నెల ఆగస్టు 9న సేవ్ ఇండియా నినాధంతో విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ పిలుపునిచ్చారు. సీపీఐ అమర్ భవన్​లో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడం, పెట్రోల్, డీజీల్ ధరలు పెంచడం లాంటి పనుల్ని చేసిందని అన్నారు. అంతేకాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్​ను ప్రైవేటుపరం చేయాలని చూస్తోందని అన్నారు.

బ్రిటిష్ వారితో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నాలుగు కార్మిక కోడ్ లతో కుదించి, వారి హక్కులను ప్రభుత్వం హరిస్తున్నదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన రోజుల్లో ఎప్పుడు కూడా దేశానికి నష్టం చేసే విధానాలు తేలేదని అన్నారు. భాజపాకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో రైతు, వ్యవసాయ, యువజన, మహిళా, కార్మికులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:Mansas Trust Employees: 'జీతాలు ఇవ్వకపోవడం రాజ్యాంగపరంగా తప్పు.. శిక్ష తప్పదు'

ABOUT THE AUTHOR

...view details