విజయనగరం జిల్లా బొబ్బిలి పురపాలక సంఘంలో పోలీస్, పురపాలక అధికారుల మధ్య వివాదం నడుస్తోంది. శిరస్త్రాణం ధరించలేదని పురపాలక సిబ్బందికి పోలీసులు వేసిన అపరాధ రుసుం రెండు శాఖల మధ్య మనస్పర్థలకు కారణమైంది. ఈ గొడవ కొనసాగుతుండగానే వారం రోజుల క్రితం పోలీసుల నివాస సముదాయాలకు తాగునీటి సరఫరా ఆగిపోయింది.
శిరస్త్రాణం... పోలీసులు, పురపాలక సిబ్బంది మధ్య వివాదం... - పోలీసులు, పురపాలక అధికారుల మధ్య వాగ్వాదం
బొబ్బిలి పురపాలక సంఘంలో పోలీస్, పురపాలక అధికారుల మధ్య వివాదం ముదిరింది. శిరస్త్రాణం ధరించలేదని పోలీసులు అపరాధ రుసుం విధించడం ఈ గొడవకు కారణమైంది. ఈ రెండు శాఖల మధ్య ఘర్షణతో తాము ఇబ్బంది పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు.
![శిరస్త్రాణం... పోలీసులు, పురపాలక సిబ్బంది మధ్య వివాదం... Conflict between police and municipal officials](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9746698-913-9746698-1606983660162.jpg)
పురపాలక సిబ్బంది కావాలనే పోలీసు క్వార్టర్స్‌కి మంచినీటి సరఫరా నిలిపివేశారని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ పురపాలక తాగునీటి సరఫరా విభాగం సభ్యులు నిరసన చేపట్టారు. ఇంకొన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలుపుదల చేశారు.
పోలీస్, పురపాలక సిబ్బంది కీచులాటతో పట్టణ ప్రజలు విసిగిపోతున్నారు. విషయం తెలుసుకున్పున రపాలక కమిషనర్ ఎంఎం.నాయుడు, సీఐ కేశవరావు పరస్పరం మాట్లాడుకోని వివాదం సద్దుమణిగేలా చేశారు. సిబ్బంది మధ్య అవగాహన లోపంతోనే సమస్య తలెత్తిందని ఇప్పుడు ఎలాంటి వివాదం లేదని మీడియా వివరించారు.