పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన సమీక్షలో మంత్రి బొత్స సత్యనారాయణకు, పార్వతీపురం శాసనసభ్యుడు అలజంగి జోగారావు మధ్య వాడీ వేడీ చర్చ జరిగింది. అధికార పార్టీకి చెందిన మంత్రి, ఎమ్మెల్యే మధ్యనే వాగ్వాదం చోటు చేసుకోవటం పట్ల సమీక్షలో పాల్గొన్న జిల్లా ఉన్నతాధికారులతో సహా అందరూ నివ్వెరపోయారు. సమీక్షలో భాగంగా మంత్రి జగనన్న కాలనీల ఏర్పాటులో మౌలిక సదుపాయలపై అధికారులతో చర్చిస్తూ... అంతర్గత రహదారుల అంశాన్ని ప్రస్తావించారు.
ఈ సందర్భంగా పార్వతీపురం శాసనసభ్యుడు అలజంగి జోగారావు కలగచేసుకుని... పార్వతీపురంలో 1900 మంది లబ్ధిదారులకు కోసం మూడు లే అవుట్లు ఎంపిక చేశారు. ఇందులో ఒక లే అవుట్ పట్టణానికి సుదూరంగా ఉండటంతో ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు ఆసక్తి చూపటం లేదని.. మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.