తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్‌తో సహా భూ సంబంధిత పలు రికార్డులు చోరీకి గురయ్యాయి. ఈ ఘటన విజయనగరం జిల్లా కొమరాడ మండలంలో జరిగింది. సిబ్బంది ఉదయం కార్యాలయానికి వచ్చి చూసేసరికి మానిటర్, రికార్డులు లేవని గుర్తించి వెంటనే తహసీల్దార్‌కు తెలిపారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కొమరాడ తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ చోరీ - కొమరాడ తహసీల్దార్ కార్యాలయం తాజా వార్తలు
విజయనగరం జిల్లా కొమరాడ తహసీల్దార్ కార్యాలయంలోని కంప్యూటర్ను చోరీ చేశారు. భూమికి సంబంధించిన పలు రికార్డులు మాయం అవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కొమరాడ తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ చోరీ