విజయనగరం జిల్లా భోగాపురం మండల వ్యవసాయశాఖ కార్యాలయంలో చోరీ జరిగింది. రహదారిని అనుకుని ఉండే ఈ కార్యాలయంలో ఎప్పటిలాగే సిబ్బంది.. విధులు ముగించుకుని తలుపులకు తాళాలు వేసి వెళ్లారు. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో మద్యం తాగిన కొంత మంది యువకులు....బిర్యానీ తినేందుకు ఐసీడీఎస్ భవనంలోకి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ క్రమంలో పక్కనే ఉన్న వ్యవసాయ శాఖ కార్యాలయం తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడే బిర్యానీ తిని... కంప్యూటర్, ల్యాప్టాప్, టాబ్ తీసుకెళ్లారు. సుమారు 80వేల విలువైన వస్తువులను తీసుకెళ్లినట్లు అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
భోగాపురం వ్యవసాయశాఖ కార్యాలయంలో చోరీ - computer stolen in bogapuram agriculture office news
బిర్యానీ తినేందుకు వచ్చిన కొందరూ యువకులు చోరీకి పాల్పడిన ఘటన విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో జరిగింది. సుమారు 80వేల రూపాయలు విలువ చేసే కంప్యూటర్, ల్యాప్టాప్, టాబ్ తీసుకెళ్లినట్లు అధికారులు గుర్తించారు.
![భోగాపురం వ్యవసాయశాఖ కార్యాలయంలో చోరీ computer and laptop stolen in bogapuram agriculture office](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9303856-567-9303856-1603595998222.jpg)
computer and laptop stolen in bogapuram agriculture office