ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించిన కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ - ITDA Office in parvathipuram news

విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయాన్ని కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ముట్టడించారు. ఏళ్లుగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన చేపట్టారు.

Community Health Workers agitation
ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించిన కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్

By

Published : Feb 15, 2021, 8:28 PM IST

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్(సీహెచ్​డబ్ల్యూ ) విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో సబ్ ప్లాన్ మండలాల్లోని వర్కర్స్​ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం సీఐటీయూ నాయకులు మాట్లాడారు. గిరిజన గ్రామాల్లో 1100 మంది సీహెచ్​డబ్ల్యూలుగా పని చేస్తున్నారన్నారు. వారందరికీ పాత జీతం నాలుగు వందలతో పాటు.. 2020 సెప్టెంబర్ నుంచి కొత్త వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్​ చేశారు. వర్కర్స్​ అందరికీ ఏకరూప దుస్తులు, గుర్తింపుకార్డులు ఇవ్వాలని కోరారు. తమ డిమాండ్లను వీలైనంత త్వరగా పరిష్కరించాలని.. లేకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details