ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోర్టు తీర్పు బేఖాతరు.. మళ్లీ రంగు పడింది! - ప్రభుత్వ కార్యాలయలకు వైకాపా రంగులు వేయడంపై తీర్పు

విజయనగరం జిల్లా ద్వారపూడిలో రైతు భరోసా కేంద్రానికి వైకాపా జెండాను పోలిన రంగులు వేయటం విమర్శలకు తావిస్తొంది. ఈ విషయంపై అధికారులను వివరణ కోరగా.. వైకాపా జెండా రంగులకు, ఈ రంగులకు తేడా ఉందని సెలవిచ్చారు.

Colors resemble the ysrcp flag
రైతు భరోసా కేంద్రానికి వైకాపా రంగులు

By

Published : May 7, 2020, 9:46 AM IST

ప్రభుత్వ కార్యాలయాలకు రాజకీయ పార్టీలకు చెందిన జెండాల రంగులు వేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ అధికారుల తీరు మారడం లేధు. విజయనగరం జిల్లా ద్వారపూడిలో రైతు భరోసా కేంద్రానికి వైకాపా జెండాను పోలిన రంగులు వేయటం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ విషయంపై వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకురాలు ఆశాదేవిని వివరణ అడగ్గా... రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలకు ఇవే రంగులు వేస్తున్నారని చెప్పారు. వైకాపా జెండా రంగులకు.. వీటికి తేడా ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details