ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జనావాసాల మధ్య కొవిడ్ కేర్ సెంటర్ వద్దంటూ.. రోడ్డుపై బైఠాయింపు - జనావాసాల మధ్య కొవిడ్ కేర్ సెంటర్ వద్దంటూ ఆందోళన వార్తలు

జనావాసాల మధ్య కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయోద్దంటూ కాలనీవాసులు నిరసన చేపట్టారు. విజయనగరం జిల్లా పార్వతీపురం శివార్లలోని వైకేఎం కాలనీవాసులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు.

people protest
జనావాసాల మధ్య కొవిడ్ కేర్ సెంటర్ వద్దంటూ ఆందోళన

By

Published : Apr 25, 2021, 10:25 AM IST

Updated : Apr 25, 2021, 12:20 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురం శివారులోని వైకేఎం కాలనీలోని వైటీసీ భవనంలో కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు పలువురు అధికారులు భవనాన్ని పరిశీలించారు. విషయం తెలుసుకున్న కాలనీవాసులు పార్వతీపురం-బొబ్బిలి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. సుమారు రెండు గంటలపాటు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. పోలీసులు వచ్చి ట్రాఫిక్​ను కంట్రోల్ చేశారు.

Last Updated : Apr 25, 2021, 12:20 PM IST

ABOUT THE AUTHOR

...view details