ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంక్షేమ పథకాల అమలులో ఎంపీడీవోలు కీలకం: కలెక్టర్

అభివృద్ది, సంక్షేమ కార్య‌క్ర‌మాల అమలులో ఎంపీడీఓల‌ పాత్ర కీల‌క‌మ‌ని క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ పేర్కొన్నారు. ఈ విషయమై సిబ్బందితో సమీక్షించారు.

Collector video conference with MPDOs
పలు శాఖల అధికారులతో క‌లెక్ట‌ర్ వీడియో కాన్ఫ‌రెన్స్

By

Published : Sep 15, 2020, 12:49 PM IST

ఎండీఓలంతా మ‌రింత చురుగ్గా, క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించి అభివృద్ది కార్య‌క్ర‌మాల అమలు‌ను వేగ‌వంతం చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ కోరారు. వివిధ మండ‌లాల ఎంపీడిఓలు, ఈఓపీఆర్‌డీల‌‌తో క‌లెక్ట‌ర్ వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. వైఎస్ఆర్ బీమా న‌మోదు, ఈ-రిక్వెస్టు, ఓడీఎఫ్ ప్ల‌స్‌, ఉపాధి హామీ క‌న్వ‌ర్జెన్సీ నిధుల వినియోగం, స‌చివాల‌య ప‌రీక్ష‌లు, నాడు-నేడు ప‌నులు, నీతి అయోగ్ త‌దిత‌ర అంశాల‌పై అధికారులతో స‌మీక్షించారు.

ఈ నెల 20 నుంచి 26 వ‌ర‌కు జ‌రిగే స‌చివాల‌య ఉద్యోగాల రాత‌ పరీక్ష‌ల‌కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు. నీతి అయోగ్ కార్య‌క్ర‌మాల అమ‌ల్లో జిల్లా ప్ర‌స్తుతం దేశంలోనే మొద‌టి స్థానంలో ఉంద‌ని, అయిన‌ప్ప‌టికీ వెనుక‌బ‌డి ఉన్న కొన్ని అంశాలపై దృష్టి సారించాల‌ని సూచించారు. వ‌శ‌కం కార్డుల పంపిణీలో 94 శాతంతో ప్ర‌స్తుతం 3వ స్థానంలో ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో క‌న్వ‌ర్జెన్సీ ప‌నుల‌కు రూ.400 కోట్లు సిద్దంగా ఉన్న‌ప్ప‌టికీ, కేవ‌లం రూ.41 కోట్లు మాత్ర‌మే వినియోగించ‌డం ప‌ట్ల అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details