ఎంతో ఘన చరిత్ర గల విజయనగరం మహారాజా కళాశాల మన వారసత్వ సంపద అని, దానిని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ అన్నారు. కళాశాలలో ఏర్పాటు చేసిన సచివాలయ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కళాశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. ఎంఆర్ కళాశాలకు సుదీర్ఘ చరిత్ర ఉందని, దానిని సంరక్షించి, ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దాల్సి ఉందన్నారు.
మహారాజా కళాశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు - maharaja college latest news update
విజయనగరం మహారాజా కళాశాలలో ఏర్పాటు చేసిన సచివాలయ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కళాశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. కళాశాలలో మొక్కలను నాటడమే కాకుండా, హరిత విజయనగరం సాధించడానికి, పచ్చదనాన్ని పెంపొందించడానికి హోర్డింగులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.

మహారాజా కళాశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
కళాశాలలో అందమైన మొక్కలను నాటడంతోపాటు, ప్రాంగణం బయట ఉన్న చెట్లకు రంగులు వేసి సుందరంగా తీర్చిదిద్దాలని కళాశాల ప్రిన్సిపాల్ జి.ఏ.కళ్యాణికి సూచించారు. గురజాడ విగ్రహం ఉన్న జంక్షన్‌ను కూడా అందంగా తీర్చిదిద్దనున్నట్లు ప్రకటించారు.
ఇవీ చూడండి..