ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫిర్యాదుల స్వీకరణకు హెల్ప్​లైన్: కలెక్టర్ - vizianagaram district newsupdates

రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ సూచ‌నల మేర‌కు ప్ర‌తి పురపాలక సంఘంలో హెల్ప్ లైన్ నెంబ‌రు ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు జిల్లా క‌లెక్ట‌ర్ హరిజ‌వ‌హ‌ర్ లాల్ తెలిపారు. విజయనగరం జిల్లాలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌ను సజావుగా నిర్వ‌హించే ల‌క్ష్యంతో ఈ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.

Establishment of helpline for receiving complaints
ఫిర్యాదుల స్వీకరణకు హెల్ప్​లైన్​ ఏర్పాటు: కలెక్టర్

By

Published : Mar 3, 2021, 6:56 AM IST

విజయనగరం జిల్లాలో పురపాలక ఎన్నికలను సజావుగా నిర్వహించే లక్ష్యంతో.. ప్రతి పురపాలక సంఘంలో హెల్ప్​లైన్ నంబర్ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ ఎం.హరిజవహర్​లాల్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు.. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించటంతో పాటు వాటిని పరిష్కరించే విధంగా ఇవి పనిచేస్తాయన్నారు. జిల్లా పుర ఎన్నికలకు పరిశీలకులు సీనియర్ ఐఏఎస్ అధికారి కాంతికలాల్ దండేతో కలిసి నగరంలో ఏర్పాట్లను పరిశీలించారు.

స్థానిక రాజీవ్ క్రీడా ప్రాంగణంలోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ ​రూమ్, ఓట్ల లెక్కింపు హాళ్లను పరిశీలించారు. ఓటర్లు ఎండ బారిన పడకుండా ఏర్పాట్లు చేయాలని.. కూలరు, తగినంత చల్లని నీరు అందుబాటులో ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ఎస్​ వర్మకు కలెక్టర్ సూచించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details