శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో కేసులు పెరుగుతున్న కారణంగా నిబంధనలు మరింత కఠినతరం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ చెప్పారు. మున్సిపల్ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణంలో కరోనా కేసులు, కంటెయిన్మెంట్ జోన్లు పెరుగుతున్నాయని తెలిపారు. కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లోని ప్రతి ఇంటి నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నట్టు వివరించారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే నిత్యావసర వస్తువుల కొనుగోలుకు అనుమతిస్తున్నట్లు వెల్లడించారు.
సిక్కోలులో విజృంభిస్తున్న కరోనా.. పరిస్థితిపై కలెక్టర్ సమీక్ష - srikakulam collector nivas latest comments on corona
జ్వరం ఇతర లక్షణాలు ఉన్నవారు నేరుగా జేమ్స్, రిమ్స్ ఆసుపత్రికి రావచ్చునని జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. ఇచ్ఛాపురం మున్సిపల్ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గతంలో శాంపిల్ సేకరణలో అధికారుల అలసత్వంపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
![సిక్కోలులో విజృంభిస్తున్న కరోనా.. పరిస్థితిపై కలెక్టర్ సమీక్ష collector nivas review meeting](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7961462-1054-7961462-1594315776819.jpg)
శిక్కొలులో విజృంభిస్తున్న కరోనా పరిస్థితిపై కలెక్టర్ సమీక్ష