ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

25, 26న.. కోవిడ్ నిబంధనలకు లోబడి శంబర పోలమాంబ జాతర

విజయనగరంలో శంబర పోలమాంబ జాతర... కరోనా నిబంధనలకు అనుగుణంగా జరుగుతుందని కలెక్టర్ హరిజవహర్ లాల్ తెలిపారు. పరిమిత సంఖ్యలో భక్తులు హాజరయ్యేలా ముందస్తు ప్రచారం చెయ్యడం జరుగుతుందని వెల్లడించారు.

Collector Harijawahar Lal
కొవిడ్ నిబంధనల నడుమ జరగనున్న విజయనగరం శంబర పోలమాంబ జాతర

By

Published : Jan 20, 2021, 11:35 AM IST

విజయనగరం జిల్లాలో జరిగే శంబర పోలమాంబ జాతర కొవిడ్ నిబంధనలతో జరగనున్నట్లు జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ తెలిపారు. ఈ నెల 25, 26 తేదీల్లో.. ఈ వేడుకల నిర్వహణపై అధికార యంత్రాంతో కలిసి... పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. నేటికి కరోనా కేసులు నమోదవుతున్నందున ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్ వాడాలన్నారు.

అందరూ భౌతిక దురాన్ని పాటించాలని కోరారు. దేవస్థాన సిబ్బంది క్యూ లైన్లలో శానిటైజర్లను అందించాలని ఆదేశించారు. భక్తులు పరిమిత సంఖ్యలో హాజరయ్యేలా ముందస్తు ప్రచారం చేస్తామన్నారు. మొక్కుబడులున్న వారు మాత్రమే దర్శనాలకు రావాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిందిగా యంత్రాంగానికి సూచించినట్టు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details