ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మూడంచెల వ్యూహంతో కొవిడ్ కట్టడికి చర్యలు: కలెక్టర్ హరి జవరహర్​ లాల్ - ఈరోజు కలెక్టర్ హరి జవరహర్​ లాల్ తాజా వ్యాఖ్యలు

రెండో దశలో ఇప్పటివరకు జిల్లాలో 30,843 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇందులో 22,925 మంది కోలుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. రికవరీ రేటు మొదటి దశలో 98.09 శాతం ఉండగా.. ప్రస్తుత దశలో 67 శాతంగా ఉందన్నారు. కొవిడ్ చికిత్స, వ్యాక్సినేషన్, బ్లాక్ ఫంగస్ తదితర అంశాలపై ఈటీవీ-ఈనాడు నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొని ప్రజల సమస్యలకు పరిష్కారం చూపారు.

Collector Hari Jawaharlal
ఫోన్ ​ఇన్​ కార్యక్రమంలో కలెక్టర్ హరి జవరహర్​ లాల్

By

Published : May 28, 2021, 10:57 AM IST

కొవిడ్ టీకాపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, 45 ఏళ్లు దాటిన ప్రతి ‌ఒక్కరికీ వేస్తామని విజయనగరం జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ తెలియజేశారు. కొవిషీల్డ్, కోవాగ్జీన్ ఏదైనా నిర్దేశించిన గడువు తర్వాతే రెండో డోసు వేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా టీకా ప్రక్రియ కొనసాగుతోందని.. అర్హులందరూ వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్ చికిత్స, వ్యాక్సినేషన్, బ్లాక్ ఫంగస్ తదితర అంశాలపై ప్రజల ఇబ్బందులను, సందేహాలను తీర్చేందుకు ఈటీవీ-ఈనాడు ఫోన్ ఇన్ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరి జవహర్ లాల్, డీఎంహెచ్​వో, రమణకుమారి, డీసీహెచ్​వో నాగభూషణం, జిల్లా కేంద్ర ఆసుపత్రి పర్యవేక్షకులు సీతారామరాజు పాల్గొన్నారు. ప్రజలతో మాట్లాడి వారు అడిగిన ప్రశ్నలకు కలెక్టర్ సమాధానమించారు. జిల్లాలో మూడంచెల వ్యూహంతో కొవిడ్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details