ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సచివాలయ పరీక్షల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ - కలెక్టర్ హరిజవహర్ లాల్

విజయనగరం జిల్లా బొండపల్లి జిల్లా పరిషత్ హైస్కూలులో గ్రామ సచివాలయ ఉద్యోగాల రాతపరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ హరిజవహర్ లాల్ పరిశీలించారు. సచివాలయ పరీక్షలు ఆదివారం నుంచి మొదలై ఈనెల 26 వరకు జరుగుతాయన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.

collector hari jawaharlal examined arrangements for the Secretariat examinations in vizianagaram
సచివాలయ పరీక్షల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

By

Published : Sep 19, 2020, 8:23 PM IST

విజయనగరం జిల్లా బొండపల్లి జిల్లా పరిషత్ హైస్కూలులో గ్రామ సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ హరిజవహర్ లాల్ పరిశీలించారు. అభ్యర్థులకు కల్పించిన వసతుల గురించి హెచ్​.ఎం. సన్యాసిరాజును అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.

కలెక్టర్ మాట్లాడుతూ.. సచివాలయ పరీక్షలు ఆదివారం నుంచి మొదలై ఈనెల 26 వరకు జరుగుతాయన్నారు. మొత్తం జిల్లాలో 54,888 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. రెండో రోజు నుంచి ఒక్క విజయనగరం కేంద్రంలోనే పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఇప్పటికే మెటీరియల్​ను ఆయా ప్రాంతాలకు పంపించినట్లు వెల్లడించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details