ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో.. కరోనా బాధితులకు హోం ఐసోలేషన్ కిట్లు పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ ప్రెసిడెంట్, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ కె.ఆర్.డి ప్రసాదరావు కార్యక్రమంలో పాల్గొన్నారు. రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ వైద్యులు సీహెచ్ వేణుగోపాల రెడ్డిలు కలెక్టర్‌తో కలిసి మందులు అందజేశారు. కొవిడ్ పాజిటివ్ రిపోర్టు, ఆధార్ కార్డును చూపించి.. కలెక్టర్ ఆఫీసు దగ్గరలో ఉన్న రెడ్ క్రాస్ నూతన భవనంలో హోం ఐసోలేషన్ కిట్లు పొందవచ్చని తెలిపారు.
అంతర్జాతీయంగా ఆమోదం పొందిన మందులతో కూడిన కిట్లను ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటివద్దనే చికిత్స పొందుతూ, వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ కొవిడ్‌ను జయించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జూనియర్ కోఆర్డినేటర్ ఎం. రామ్మోహన్ రావు, రెడ్ క్రాస్ జిల్లా క్షేత్రాధికారులు డి. గౌరీ శంకర్ ఎన్. చంద్ర రావు పాల్గొన్నారు.