ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

COLLECTOR MEET: ప్రభుత్వాసుపత్రుల్లో సేవలపై కలెక్టర్​ సమీక్ష - ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు

విజయనగరం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందుతున్న వైద్యసేవలు, మౌలిక సదుపాయాలపై కలెక్టర్ హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ (COLLECTOR HARI JAWAHAR LAL) సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఇందులో వైద్యారోగ్యశాఖకు​ చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

COLLECTOR MEET
ప్రభుత్వాసుపత్రుల్లో సేవలపై కలెక్టర్​ సమీక్ష

By

Published : Jul 10, 2021, 9:06 PM IST

ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో అందే వైద్య సేవ‌ల‌పై ప్ర‌జ‌ల్లో మ‌రింత నమ్మ‌కం పెర‌గాల‌ని, ఆ విధంగా వైద్యాధికారులు, వైద్యులు, సిబ్బంది కృషి చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ (COLLECTOR HARI JAWAHAR LAL) పేర్కొన్నారు. భ‌విష్య‌త్తు అవ‌స‌రాల దృష్ట్యా ఆసుప‌త్రుల్లో అభివృద్ధి చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు. అవ‌స‌ర‌మైన వైద్య ప‌రిక‌రాల‌ను కొనుగోలు చేయాల‌ని, మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించాల‌ని ఆదేశించారు.

కొవిడ్​ కార్యాచరణపై చర్చ..

జిల్లా కేంద్రాసుప‌త్రి స‌మావేశ మందిరంలో.. జిల్లా ఆసుప‌త్రి అభివృద్ధి సంఘం స‌మావేశం జ‌రిగింది. దీనిలో భాగంగా జిల్లా ఆసుప‌త్రి అభివృద్ధి సంఘం ఛైర్మ‌న్ హోదాలో క‌లెక్ట‌ర్ చర్చించవలసిన అంశాల‌ను వివ‌రించారు. కొవిడ్‌ సమయంలో అధికార యంత్రాంగం తీసుకున్న సాహ‌సోపేత నిర్ణ‌యాలు, వైద్యులు అందించిన సేవ‌ల‌ను (FACILITIES) ఆయన ప్ర‌స్తావించారు. గ‌త స‌మావేశంలో చ‌ర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణ‌యాల‌ పురోగతి, ప్ర‌స్తుత స‌మావేశంలో నిర్దేశించుకున్న లక్ష్యాలపై స‌భ్యులు సుదీర్ఘంగా చ‌ర్చించారు. ఆసుప‌త్రుల్లో అవ‌స‌ర‌మైన మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు, వైద్య ప‌రిక‌రాల కొనుగోలుకు, ఇత‌ర అభివృద్ధి చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు తీర్మానం చేశారు.

మౌలిక సదుపాయాలపై అసహనం..

కొవిడ్ (COVID) స‌మయంలో అంద‌రూ అద్భుతంగా సేవలు అందించారని ఎంపీ బెల్లాన చంద్ర‌శేఖ‌ర్ (MP BELLANA CHANDRASHEKAR) కొనియాడారు. అయితే కేంద్రాసుప‌త్రిలో ఆల్ట్రా సౌండ్‌, ఇత‌ర స్కానింగ్ (SCANNING) సదుపాయాల విష‌యంలో ఇబ్బందులు త‌లెత్తుతున్నాయ‌ని.. దీనిపై ప్ర‌జ‌ల నుంచి ఫిర్యాదులు వ‌స్తున్నాయ‌ని అన్నారు. స్కానింగ్​ మెషిన్​ లేక ఇప్పటికీ రోగులను బయట కేంద్రాలకు పంపవలసిన పరిస్థితులు నెలకొనడంపై అసహనం వ్యక్తం చేశారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని స్కానింగ్‌లు తీశారో నివేదిక కావాల‌ని ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్‌ను ఆదేశించారు. ఆరోగ్య శ్రీ ప‌థ‌కం (AROGYA SREE) ద్వారా అందించిన సేవ‌లు, నిధుల వివ‌రాల‌ను కూడా ఇడిగి తెలుసుకున్నారు. గ‌ర్బిణీ స్త్రీల‌కు అందే వైద్య సేవ‌ల‌పై ఆరా తీశారు. ఘోషా ఆసుప‌త్రిపై ఒత్తిడి త‌గ్గించేందుకు కేంద్రాసుప‌త్రిలో కూడా గ‌ర్బిణీ స్త్రీల‌కు (PREGANT WOMEN) సేవ‌లందించాల‌ని కోరగా.. అన్ని ర‌కాల వైద్య సదుపాయాలు కలిగిన ఘోషాసుప‌త్రికే వాటిని పరిమితం చేసినట్లు సూప‌రింటెండెంట్‌, డీసీహ‌చ్ఎస్ ఎంపీకి బదులిచ్చారు.

కొవిడ్‌పై ప్ర‌చారం కల్పిస్తూ.. 'మాస్కే క‌వ‌చం' అనే నినాదంతో రూపొందించారు. దానిని జిల్లా ఆసుప‌త్రి అభివృద్ధి సంఘం స‌మావేశం యునిసెఫ్ ఆధ్వ‌ర్యంలో రూపొందించిన పోస్ట‌ర్‌ను ఎంపీ బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి చేతుల మీదుగా ఆవిష్క‌రించారు. ఈ కార్యక్రమంలో వైద్యశాఖకు చెందిన ఉద్యోగులు, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

'నూతన జాబ్ క్యాలెండర్ వచ్చే వరకు సర్వశక్తులు ఒడ్డి పోరాడుతాం'

ABOUT THE AUTHOR

...view details