ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంచాయతీ ఎన్నికలపై కలెక్టర్ సమీక్ష - పంచాయతీ ఎన్నికలపై విజయనగరం కలెక్టర్ సమీక్ష

విజయనగరం జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ హరి జవహర్ లార్... అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల చర్యల్లో భాగంగా పోలీసు శాఖ చేపడుతున్న భద్రతా ఏర్పాట్లను ఎస్పీ రాజకుమారి వివరించారు.

పంచాయతీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్
పంచాయతీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్

By

Published : Jan 27, 2021, 8:53 AM IST

విజయనగరం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరిజవహర్​లాల్ తెలిపారు. అందుకు అనుగుణంగా కసరత్తు ప్రారంభించామన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కలెక్టరెట్ సమావేశ మందిరంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఎస్పీ రాజకుమారితో పాటు పలు శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సుమారు గంటన్నర పాటు జరిగిన సమావేశంలో ఎన్నికల సిబ్బంది, సామాగ్రి, ఎన్నికల నియమావళి, సమస్యాత్మక, అతిసమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత గ్రామాలు, భద్రతా సిబ్బంది అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రెండు, మూడు విడతల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికారులు, సిబ్బంది అనుసరించాల్సిన విధానాలు, పాటించాల్సిన ఎన్నికల నియమాలను తెలియచేశారు. ఎన్నికల భద్రతా చర్యల్లో భాగంగా పోలీసుశాఖ చేపడుతున్న చర్యలను ఎస్పీ రాజకుమారి వివరించారు.

ABOUT THE AUTHOR

...view details