ఏటీఎంలో ఆకస్మాత్తుగా నాగుపాము కనిపించేసరికి డబ్బులు తీయడానికి వెళ్ళిన ఖాతాదారులు భయంతో పరుగులు తీశారు విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఆకుల డిపో సమీపంలోని కార్పొరేషన్ బ్యాంక్ ఏటీఎంలో. గురువారం రాత్రి నాగుపాము సుమారు 20 నిమిషాల పాటు కదలకుండా అక్కడే తిష్ట వేసింది. డబ్బులు తీయడానికి వెళ్లిన ఖాతాదారుడికి నాగుపాము కనిపించడం వల్ల భయంతో బయటకు వచ్చారు. గమనించిన స్థానికులు పాములు బయటకు పంపడానికి తీవ్రంగా ప్రయత్నించారు. పాములు పట్టే వాడికి సమాచారం అందించారు. అతను అందుబాటు లేకపోవడం వల్ల ఏటీఎం తలుపులు తీసి వదలేశారు. కొద్ది సేపటికి పాము చల్లగా అక్కడి నుంచి జారుకుంది.
ఏటీఎంలో నాగుపాము - s.kota lates news
ఎస్. కోటలోని ఆకుల డిపో వద్దనున్న కార్పొరేషన్ బ్యాంకు ఏటీఎంలో గురువారం రాత్రి నాగుపాము కలకలం రేపింది. స్థానికులు దానిని బయటకి పంపేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. చివరకు తలుపులు తెరచాక సర్పం బయటకు వెళ్లిపోయింది.
ఏటీఎంలో నాగుపాము