రూ.500 కోట్లతో 70 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా విజయనగరంలో వైద్య కళాశాల ఏర్పాటవుతుందని జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ తెలిపారు. ఇప్పటికే వైద్య కళాశాల నిర్మాణ సంస్థను ఖరారు చేసినట్టు వివరించారు. ఈ కళాశాల పక్కనే 5 ఎకరాల విస్తీర్ణంలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని నిర్మిస్తున్నట్టు తెలిపారు.
ఈ రెండు ఆసుపత్రులూ అందుబాటులోకి వస్తే జిల్లా ప్రజలకు పూర్తిస్థాయిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని కలెక్టర్ వివరించారు. ఈ నెల 31న ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో వైద్య కళాశాలకు శంకుస్థాప చేస్తారన్నారు.