ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 30న విజయనగరంలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ తెలిపారు. సీఎం పర్యటనకు సంబంధించి.. గుంకలాంలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. నవరత్నాల కార్యక్రమాల నిర్వహణలో భాగంగా.. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి సీఎం హాజరవుతున్నట్లు వివరించారు. 30వ తేదీ ఉదయం 11.10గంటలకు.. విశాఖ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సీఎం విజయనగరం చేరుకుంటారని కలెక్టర్ తెలిపారు.
గుంకలాంలో ఇళ్ల పట్టాలకు సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరించి, లబ్ధిదారులకు పట్టాలు అందచేస్తారు. పట్టాల పంపిణీ ముగిసిన అనంతరం.. లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు.