జగన్ ప్రభుత్వం ఇసుకను విలువైన వస్తువుగా మార్చి.. ఇల్లు నిర్మించుకునే లబ్దిదారులకు అందకుండా చేశారని భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు పడాల రమణ విమర్శించారు. ఈ కారణంగానే భవన నిర్మాణ కార్మికులకు పనులు లేకుండా పోయాయని ఆరోపించారు. పూట గడవక చాలా మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని విజయనగరం అమర్ భవన్ లో భవన నిర్మాణ కార్మికుల జిల్లా కార్యవర్గ సమావేశంలో విమర్శించారు.
కరోనా నేపథ్యంలో పనులు లేక భవన నిర్మాణ కార్మికుల అనేకమైన అవస్థలు పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. వెల్ఫేర్ బోర్డులో గుర్తింపు కార్డులు కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న భవన నిర్మాణ కార్మికులకు సకాలంలో కార్డులు ఇవ్వకుండా కాలయాపన చేయడం సరికాదన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని లేకపోతే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.