ఈ నెల 24న విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. పర్యటన వివరాలను మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. 'జగనన్న వసతి దీవెన' కార్యక్రమం, దిశ పోలీస్‌స్టేషన్‌ను సీఎం ప్రారంభిస్తారని మంత్రి బొత్స తెలిపారు. తెదేపా నేతలు ప్రజా చైతన్య యాత్రతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గత ఐదేళ్లలో జిల్లాకు ఒక కొత్త పరిశ్రమ కూడా రాలేదని పేర్కొన్నారు. తమ ప్రభుత్వానికి పరిశ్రమలు ఎలా తేవాలో... ఉద్యోగాలు ఎలా కల్పించాలో తెలుసని వ్యాఖ్యానించారు. సభకు వచ్చే వారందరికీ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. జిల్లా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.
ఈ నెల 24న విజయనగరం జిల్లాకు సీఎం జగన్ - CM Jagan latest news
ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 24న విజయనగరం జిల్లాకు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి పర్యటించనున్న ప్రాంతాలు, సభావేదిక ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులతో చర్చించారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు, చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ నెల 24న విజయనగరం జిల్లాకు సీఎం జగన్