విజయనగరం జిల్లా పాచిపెంట మండలం కర్రివలస పంచాయతీ కంకణాలపల్లి గ్రామంలో పరిసరాల పరిశుభ్రత..ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. గత కొద్ది రోజులుగా కంకణాలపల్లిలో ప్రజలు వింత వ్యాధితో సతమతమవుతున్నారు. మేము వెల్ఫేర్ అసోసియేషన్ సాలూరు ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రతకు తీసుకోవాల్సిన చర్యలు .. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తెలియజేశారు. గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారాన్ని తీసుకోని తగు జాగ్రత్తలు తీసుకోవాలని.. లేకపోతే రక్తహీనత వచ్చే ప్రమాదముందన్నారు. కార్యక్రమం అనంతరం పండ్లు పంపిణీ చేశారు. సంస్థ అధ్యక్షులు దిలీప్ కుమార్, సహాయ కార్యదర్శి గణేశ్ నారాయణ, సంస్థ సభ్యులు బి. వెంకట్, కె. వంశీ, బి. సంతోష్, బి. ఈశ్వరరావు, ప్రసాద్, ప్రకాష్, జగదీష్, సూర్య, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
కంకణాలపల్లిలో పరిసరాల శుభ్రతపై అవగాహన కార్యక్రమం
విజయనగరం జిల్లా కంకణాలపల్లి గ్రామంలో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్థులకు ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.
కంకణాలపల్లిలో పరిసరాల శుభ్రతపై అవగాహన కార్యక్రమం