విజయనగరం జిల్లా జామి మండలం పావాడలో చిన్నఅప్పలనాయుడు, అల్లు అప్పలనాయుడు మధ్య గత 30 ఏళ్లుగా భూ వివాదం నెలకొంది. చిన్న అప్పలనాయుడు వర్గం... పొలంలో పని చేసుకుంటున్న అల్లు అప్పలనాయుడు, లింగాల అప్పడు, అల్లు ఈశ్వరరావుపై కర్రలతో దాడి చేశారు.
ఈ ఘర్షణలో వీరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని విజయనగరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టామని తెలిపారు.