విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలోని 4వ నెంబరు రేషన్ డిపోలో పౌర సరఫరాల శాఖ అధికారులు మెరుపుదాడి చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించారు. గోడౌన్లో అక్రమంగా నిల్వ ఉంచిన 3.60 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. వీటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని అధికారులు తెలిపారు.
రేషన్ డిపోలో 3.60 టన్నుల అక్రమ నిల్వలు పట్టివేత - సాలూరు రేషన్ డిపో తనిఖీలు తాజా వార్తలు
సాలూరు పట్టణంలోని 4వ నెంబరు రేషన్ డిపోలో జరుగుతున్న అవకతవకలను పౌర సరఫరాల శాఖ అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేసి అక్రమ నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
సాలూరు 4వ నెంబరు రేషన్ డిపోలో తనిఖీలు