భోగాపురం విమానాశ్రయం ప్రారంభమైతే ఇప్పుడున్న వైజాగ్ నావల్ ఎయిర్‌ఫీల్డ్‌లో 30ఏళ్లపాటు పౌర విమానయాన సేవలు నిలిచిపోతాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ తెలిపారు. గురువారం లోక్‌సభలో ఎంపీ రఘురామకృష్ణరాజు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2016జనవరిలో రాష్ట్ర ప్రభుత్వానికి స్థల అనుమతి ఇచ్చిందన్నారు.
భోగాపురం విమానాశ్రయం ప్రారంభమైతే వైజాగ్‌లో పౌరవిమానాలు నిలిచిపోతాయి: వీకే సింగ్ - AP main news
భోగాపురం విమానాశ్రయం ప్రారంభమైతే ఇప్పుడున్న వైజాగ్ నావల్ ఎయిర్‌ఫీల్డ్‌లో 30ఏళ్లపాటు పౌర విమానయాన సేవలు నిలిచిపోతాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ తెలిపారు. గురువారం లోక్‌సభలో ఎంపీ రఘురామకృష్ణరాజు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు.
భోగాపురం విమానాశ్రయం ప్రారంభమైతే వైజాగ్‌లో పౌరవిమానాలు నిలిచిపోతాయి
ప్రస్తుతం వైజాగ్ విమానాశ్రయంలో ఉన్న సివిల్ ఎన్‌క్లేవ్‌కి చెందిన భూమిని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా పేరు మీద మార్చి అప్పగించేలా గత సెప్టెంబరులో ఏఏఐ, ఏపీ ప్రభుత్వం మధ్య పరస్పర అవగాహన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలోని నిబంధనలకు లోబడి ప్రస్తుత వైజాగ్ నావల్ ఎయిర్‌ఫీల్డ్‌లో 30ఏళ్లపాటు షెడ్యూల్డ్ వాణిజ్య కార్యకలాపాలు నిలిపేయడానికి పౌరవిమానయానశాఖ ఎన్‌ఓసీ జారీ చేసిందని జనరల్ వీకేసింగ్ వివరించారు.
ఇవీ చదవండి: