ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఆశ, అంగన్వాడీ కార్యకర్తలతో పాటు వివిధ శాఖల్లో పని చేస్తున్న ఒప్పంద ఉద్యోగులు విజయనగరం జిల్లా సాలూరులో సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపేశారని వాటిని వర్తింపజేయాలని నినదించారు. ఐదు నెలలుగా హెల్త్ అలవెన్స్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని వాటిని విడుదల చేయాలన్నారు. సాలూరు నియోజకవర్గంలో ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఒప్పంద ఉద్యోగులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటూ సీఐటీయూ ర్యాలీ - సీఐటీయు ర్యాలీ సాలూరు నియోజకవర్గం
అంగన్వాడీ , ఆశ కార్యకర్తలతో పాటు వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
'ఒప్పంద ఉద్యోగులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి'