ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దేశవ్యాప్త సమ్మెకు మద్దతు కోరుతూ సీఐటీయూ ర్యాలీ - దేశ సంపదను రక్షించుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు సమ్మె

కార్పొరేట్ శక్తులకు మద్దతుగా మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఈ నెల 26న కార్మిక సంఘాలు సమ్మె చేపట్టనున్నాయి. దానికి అనుగుణంగా సీఐటీయూ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని కోరారు.

TREAD_UNIONS_BIKE_RALLY_
సీఐటీయూ ర్యాలీ

By

Published : Nov 22, 2020, 3:35 PM IST

కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గాన్ని అణిచివేసి, కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా పని చేస్తోందని సీఐటీయూ నాయకులు రమణ విమర్శించారు. కేంద్ర వైఖరికి నిరసనగా కార్మిక సంఘాలు ఈనెల 26న దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయని తెలిపారు. అందులో భాగంగా విజయనగరం కోట జంక్షన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు బైక్ రాలీని నిర్వహించామని వివరించారు. వ్యవసాయ రంగ సంబంధిత నూతన చట్టాలు రైతులకు, ప్రజలకు తీవ్ర నష్టాన్ని తెచ్చి పెడుతున్నాయని పేర్కొన్నారు. దేశ సంపదను రక్షించుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు సమ్మెలో పాల్గొనాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details