విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో ఆర్టీసీ డిపో ఎదుట సీఐటియూ ధర్నా చేపట్టింది. ఆర్టీసీలో ఉన్న ప్రైవేట్ అద్దె బస్సుల డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేసింది.
పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని... గుర్తింపు కార్డులు, జిల్లా అంతా తిరగడానికి బస్ పాస్ ఇవ్వాలని కోరారు. డిసెంబర్ ఒకటో తారీకు నుంచి అద్దె బస్సులు కొన్ని తిరగడానికి అనుమతించటంపై హర్షం వ్యక్తం చేశారు.