ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వీఆర్ఏ, నామినీల సమస్యలు పరిష్కరించాలి: సీఐటీయూ - citu demand to give pay scale to vras and namivi promote as a vra

వీఆర్ఏలకు పేస్కేల్ ఇవ్వాలని, నామినీలుగా పని చేస్తున్నవారిని వీఆర్ఏలుగా నియమించాలని సీఐటీయూ విజయనగరం జిల్లా నేతలు డిమాండ్​ చేశారు.

citu demand to give pay scale to vras and namivi promote as a vra at vizianagaram
వీఆర్ఏ, నామినీల సమస్యలు పరిష్కరించాలి: సీఐటీయూ

By

Published : Sep 29, 2020, 12:43 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులకు పే స్కేల్ ఇవ్వాలని, నామినీలుగా పనిచేస్తున్న వారందరిన్నీ వీఆర్ఏలుగా నియమించాలని ప్రభుత్వాన్ని సీఐటీయూ విజనయగరం జిల్లా సెక్రటరీ జగన్ విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆద్వర్యంలో ధర్నా నిర్వహించారు.

సీఎం జగన్.. 2017లో ప్రతిపక్ష నేతగా వీఆర్‌ఏలు చేపట్టిన ధర్నాకు మద్దతిచ్చారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా ఏపీలోనూ వీఆర్‌ఏలకు గుర్తింపు, పదోన్నతులు ఇవ్వాలన్నారు. వీఆర్‌ఏల సంఘం అధ్యక్షులు కె.గురుమూర్తి, కోశాధికారి రమాదేవి, కార్యదర్శి ప్రసాద్, సీఐటీయూ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details