ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 13, 2020, 3:14 PM IST

ETV Bharat / state

కార్మిక చట్టాలలో మార్పులను ఉప సంహరించుకోవాలి: సీఐటీయూ

మోదీ ప్రభుత్వం, కార్మిక హక్కులను కాలరాస్తూ.. కార్మిక చట్టాలను ఆమోదిస్తుందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కృష్ణంరాజు విమర్శించారు. కార్మిక వర్గం అనుభవిస్తున్న అనేక కార్మిక చట్టాలను, కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చేసిందని కృష్ణంరాజు అన్నారు.

citu comments on pm
citu comments on pm

మోదీ ప్రభుత్వం అడుగడుగునా కార్మిక వర్గాన్ని అణిచి వేసి, కార్పొరేట్ శక్తులకు పని చేసిందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కృష్ణంరాజు అన్నారు. మోదీ ప్రభుత్వం అనుసరించిన కార్మిక, ఉద్యోగ, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26వ తేదీన దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా పోస్టర్లను విడుదల చేశారు.

విజయనగరం జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. మోదీ ప్రభుత్వం ఇప్పటికైనా వెనక్కి తగ్గి కార్మిక చట్టాలలో మార్పులను ఉప సంహరించుకోవాలని, కార్మిక చట్టాలను పగడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:దేశంలో 87 లక్షలు దాటిన కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details