విజయనగరంలోని క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని ప్రముఖ చర్చిలన్నీ సుందరంగా ముస్తాబయ్యాయి. విద్యుద్దీపాల కాంతుల నడుమ కనువిందు చేస్తు జీసస్ ప్రతిమలు ఆకట్టుకున్నాయి. వేకువజాము నుంచే చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్లు ఏసు బోధనలను, ప్రత్యేక సందేశాలను అందించారు. కొవిడ్-19 నిబంధనల మేరకు క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు
పార్వతీపురంలో...
పార్వతీపురం నియోజకవర్గంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అర్ధరాత్రి నుంచే చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. మహిళలు,యువకులు నూతన వస్త్రాలు ధరించి ప్రార్థనల్లో పాల్గొన్నారు. మతపెద్దలు క్రీస్తు బోధనలు వివరించి సన్మార్గంలో నడవాలని సూచించారు. ఏసు జననం ఆయన జీవిత మార్గం గూర్చి భక్తులకు వివరించారు. లూథరన్ ఆర్సీఎం చర్చిలో క్రీస్తు జననం కరోనా అంతం ప్రదర్శన ఆకట్టుకుంది.
ఇదీ చదవండి:
ఘనంగా క్రిస్మస్ వేడుకలు.. వేకువజాము నుంచే ప్రార్థనలు