విజయనగరం జిల్లాలో భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు
విజయనగరంలోని చర్చిలన్నీ విద్యుత్ దీపాలతో సర్వాంగా సుందరంగా ముస్తాబయ్యాయి. రాత్రి నుంచే అన్నిచర్చిల్లో ప్రార్థనలు మెుదలవ్వగా... సందడి వాతావరణం నెలకొంది. కులమతాలకతీతంగా ప్రజలు ఈ వేడుకలకు హాజరయ్యారు. చర్చిల్లో భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. ఏసు భక్తి పాటలు పాడారు.