విజయనగరం జిల్లా చిరంజీవి యువత.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ త్వరగా కొలుకోవాలంటూ శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం సంపూర్ణంగా బాగుండాలని అమ్మవారిని వేడుకున్నామన్నారు. ఆయన కోలుకుని విజయనగరం అమ్మవారిని దర్శించుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆదాడ మోహన్, అభిమానులు పాల్గొన్నారు.
పవన్ కల్యాణ్ కొలుకోవాలని పైడితల్లి అమ్మవారికి అభిమానుల పూజలు - vijayanagaram updates
కరోనా నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ త్వరలోనే కోలుకోవాలని విజయనగరం జిల్లా చిరంజీవి యువత శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ ఆరోగ్యం సంపూర్ణంగా బాగుండాలని వేడుకున్నామని తెలిపారు.
పవన్ కల్యాణ్