ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెస్కో విలీనానికి మరో అడుగు! - చీపురుపల్లి గ్రామీణ విద్యుత్తు సహకార సంఘం వార్తలు

విజయనగరం జిల్లా చీపురుపల్లి గ్రామీణ విద్యుత్తు సహకార సంఘాన్ని (ఆర్‌ఈసీఎస్‌) డిస్కంలో విలీనం చేసే దిశగా.. మరో అడుగు ముందుకు పడింది. డిస్కంలో విలీనం చేయాలన్న ప్రతిపాదన చాలా ఏళ్లుగా ఉంది. దీనిపై రెస్కో ఎండీ పి.రమేష్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేస్తే విలీన ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు.

resco merging
resco merging

By

Published : May 4, 2021, 7:22 PM IST

చీపురుపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంఘాన్ని ఆర్​ఈసీఎస్ లో విలీలనం చేసే విషయమై... రెస్కో ఎండీ పి.రమేష్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేస్తే విలీన ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. 1982లో ఏర్పాటైన రెస్కోకు ప్రతి ఏటా విద్యుత్తు బిల్లుల ద్వారా రూ.22 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. సంస్థ నిర్వహణకు రెండేళ్లుగా లైసెన్స్‌ పొందనందున వెంటనే స్వాధీనం చేసుకుని లావాదేవీలను నిర్వహించాలంటూ ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలి మార్చి 25న ఏపీఈపీడీసీఎల్‌కు ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు ఆర్‌ఈసీఎస్‌ను స్వాధీనం చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ ఈపీడీసీఎల్‌ సీఎండీ విద్యుత్తు శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శికి లేఖ రాశారు. రెస్కోలో లావాదేవీలను నిర్వహించేందుకు ఈఈ స్థాయి అధికారిని నియమించడానికి, విద్యుత్తు కనెక్షన్ల జారీ, బిల్లుల వసూళ్లు, మీటర్‌ రీడింగ్‌, ఇతర వ్యవహారాలన్నీ ఇప్పుడు ఆ సంస్థలో జరుగుతున్న విధంగా నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని ప్రిన్సిపల్‌ కార్యదర్శిని కోరారు. దీనికి సంబంధించి ప్రతులను రెస్కోకు సీఎండీ పంపారు.

ఉత్తర్వులు వచ్చే అవకాశం:

రాష్ట్రంలోని చీపురుపల్లి, అనకాపల్లి, కుప్పం రెస్కోలను డిస్కంలో విలీనం చేయాలన్న ప్రతిపాదన చాలా ఏళ్లుగా ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చాక మరోసారి ఈ అంశం తెరమీదకు వచ్చింది. దీనిపై రెస్కో ఎండీ పి.రమేష్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేస్తే విలీన ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు.

ఇదీ చదవండి:

మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ.. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details