Chinna jeeyar: విజయనగరం జిల్లా గంట్యాడలో ఓ దళితుడి ఇంటి శంకుస్థాపనకు చినజీయర్ స్వామి నేడు రానున్నారు. గ్రామానికి చెందిన బేపల గణేష్ దళితుడు.. అంధుడు. చిన్నతనం నుంచి జీయర్ స్వామి ట్రస్టు ఆధ్వర్యంలోని అంధుల పాఠశాలలో అక్షరాలు దిద్ది.. డిగ్రీ వరకు చదివారు. వంద మంది చిన్నారులకు భగవద్గీత నేర్పించారు. దీంతో చినజీయర్ స్వామి రెండేళ్ల కిందట 40 వేల మందితో గంట్యాడలోనే గీతా పారాయణం నిర్వహించారు. గణేష్‌కు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలం మంజూరు చేసింది. చినజీయర్ స్వామి బుధవారం సాయంత్రం 5 గంటలకు తన ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారని గణేష్ తెలిపారు.
Chinna jeeyar: దళితుడి ఇంటి శంకుస్థాపనకు చిన జీయర్‌స్వామి - చిన్నజీయర్ తాజా వార్తలు
Chinna jeeyar: విజయనగరం జిల్లా గంట్యాడలో ఓ దళితుడి ఇంటి శంకుస్థాపనకు చినజీయర్ స్వామి నేడు రానున్నారు. చినజీయర్ స్వామి బుధవారం సాయంత్రం 5 గంటలకు తన ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారని గణేష్ తెలిపారు.
దళితుడి ఇంటి శంకుస్థాపనకు చిన జీయర్‌స్వామి