ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Chinna jeeyar swamy: గోసంరక్షణ, స్త్రీ ఆరోగ్యంతో జాతికి మేలు

Chinna jeeyar swamy: గోసంరక్షణ, స్త్రీ ఆరోగ్యంతోనే జాతికి, సమాజానికి, కుటుంబానికి మేలు జరుగుతుందని త్రిదండి చినజీయర్ స్వామి పేర్కొన్నారు. బుధవారం విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన సువ్రత గోవుల ఆశ్రమాన్ని(గోశాల) ప్రారంభించారు. అనంతరం దళిత యువకుడు గణేష్ ఇంటి నిర్మాణం కోసం.. రూ.2లక్షలు అందించి, నిర్మాణాన్ని ప్రారంభించారు.

Chinna jeeyar swamy inaugrated goshala at vizianagaram
గోసంరక్షణ, స్త్రీ ఆరోగ్యంతో జాతికి మేలు

By

Published : Jun 9, 2022, 9:08 AM IST

Chinna jeeyar swamy: గోసంరక్షణ, స్త్రీ ఆరోగ్యంతోనే జాతికి, సమాజానికి, కుటుంబానికి మేలు జరుగుతుందని త్రిదండి రామానుజ చినజీయర్‌ స్వామి పేర్కొన్నారు. బుధవారం విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన గంట్యాడలో నిర్మించిన సువ్రత గోవుల ఆశ్రమాన్ని(గోశాల) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు. ‘మానవ సేవ కోసం సకల ప్రాణుల సేవ’ అన్న సూత్రంతో ప్రతి ఒక్కరూ జీవించాలన్నారు. నేల, గాలి, వాతావరణం, చెట్లను కాపాడుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా గోశాల ఏర్పాటుచేశామని, దీనిని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరూ తీసుకోవాలన్నారు.

వందల మందికి భగవద్గీతను ఉచితంగా బోధిస్తున్న అంధుడు, దళితుడైన గణేష్‌ సంఘసంస్కర్త అని చినజీయర్‌స్వామి కొనియాడారు. ఆయన ఇంటి నిర్మాణం కోసం రూ.2లక్షలు అందించి, నిర్మాణాన్ని ప్రారంభించారు. గీతాపారాయణంలో ప్రతిభ చూపుతున్న మరో దళిత విద్యార్థి ఇంటికి చినజీయర్‌స్వామి వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా అంబేడ్కర్‌ దళిత సంఘం ప్రతినిధులు ఆయనకు అంబేడ్కర్‌ విగ్రహాన్ని అందజేశారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details