ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆలయాలపై దాడులకు రామతీర్థం ఘటన పరాకాష్ఠ: చినజీయర్‌ స్వామి

ఆలయాలపై దాడులకు రామతీర్థం ఘటన పరాకాష్ఠ అని త్రిదండి చినజీయర్‌ స్వామి అన్నారు. శ్రీ కోదండ రాముని ఆలయాన్ని ఆయన గురువారం సందర్శించారు. ఈనెల 17 నుంచి రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో పర్యటిస్తానని తెలిపారు. ఏడాదిలోగా ప్రతి ఆలయంలో రక్షణ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

China Jeeyar Swamy visits Raama Teertham Temple
China Jeeyar Swamy visits Raama Teertham Temple

By

Published : Jan 14, 2021, 3:26 PM IST

Updated : Jan 14, 2021, 6:01 PM IST

రాష్ట్రంలోని ప్రతి ఆలయాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయాలని త్రిదండి చినజీయర్‌ స్వామి అన్నారు. భక్తులు నిత్యం వచ్చేలా ఆలయాలను తీర్చిదిద్దాలని కోరారు. విజయనగరం జిల్లా రామతీర్థంలోని శ్రీ కోదండ రాముని ఆలయాన్ని ఆయన గురువారం సందర్శించారు. దేవాలయాన్ని, ధ్వంసమైన విగ్రహం లభించిన కొలనును పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను స్వామీజీకి ఆలయ అధికారులు తెలిపారు. అనంతరం మీడియాతో చినజీయర్ స్వామి మాట్లాడారు.

ఆలయాలపై దాడులకు రామతీర్థం ఘటన పరాకాష్ఠ. దీనిని హెచ్చరికగా తీసుకోవాలి. రామతీర్థం ఆలయ నిర్మాణానికి ఆగమశాస్త్ర సూచనలు చేశాం. ఈనెల 17 నుంచి రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో పర్యటిస్తాం. రాజకీయాలకు అతీతంగా ఆలయాల దర్శన యాత్ర చేస్తున్నాం. ఆలయాల్లో ఘటనల తీరు, లోపాలను తెలుసుకునేందుకే ఈ పర్యటన. లోపాలు సరిదిద్దేందుకు అవసరమైన చర్యలు సూచిస్తాం. ప్రభుత్వ చర్యలతో పాటు ప్రజల్లోనూ భక్తిభావం, బాధ్యత ఉండాలి. దేవదాయశాఖ తగిన రక్షణ ఏర్పాట్లు చేయాలి. ఏడాదిలోగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా- త్రిదండి చినజీయర్‌ స్వామి

Last Updated : Jan 14, 2021, 6:01 PM IST

ABOUT THE AUTHOR

...view details