విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామంలోని రేషన్ దుకాణాల్లో మండల ప్రత్యేక అధికారి రామ్మూర్తి ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సరకులు సక్రమంగా అందుతున్నాయా.. లేదా అని వినియోగదారులను అడిగి తెలుసుకున్నారు. రేషన్ దుకాణాల్లోని తూనికలను పరిశీలించారు. కరోనా వ్యాప్తి కారణంగా రేషన్ దుకాణాలకు వచ్చే వినియోగదారులు భౌతిక దూరం పాటించేటట్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో శానిటైజర్, తాగునీరు ఉంచాలని డీలర్లకు సూచించారు.
జియ్యమ్మవలస మండలం రేషన్ దుకాణాల్లో తనిఖీలు - విజయనగరం జిల్లా వార్తలు
విజయనగరం జిల్లాలోని రేషన్ దుకాణాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. లబ్ధిదారులకు సరకులు సరిగా పంపిణీ చేయడం లేదన్న ఆరోపణలపై అధికారులు స్పందించారు.
Checks at ration shops