ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ పథకాల కోసం... ఆధార్ కార్డులో మార్పులు - ఆధార్ కార్డు మోసం అప్​డేట్ వార్తలు

ప్రభుత్వ పథకాల కోసం... ఆధారు కార్డులో వయస్సును మార్చుతున్న ముఠాను గుట్టురట్టు చేశారు పోలీసులు. ఆధారు కార్డులో మోసాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు విజయనగరం జిల్లా చీపురుపల్లి పోలీసులు తెలిపారు.

cheating in aadhar card
ఆధార్ కార్డులో మార్పులు

By

Published : Sep 23, 2020, 11:56 PM IST

విజయనగరం జిల్లా చీపురుపల్లిలో బీఎస్​ఎన్​ఎల్ ఆఫీసులో నకిలీ ఆధార్​ కార్డుల ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. నకిలీ ఆధార్ కార్డుల విషయంపై.. ఎమ్మార్వో ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొందేందుకు ఆధార్​ కార్డులో ఉన్న వయస్సును మార్పిడి చేస్తున్నట్లు గుర్తించినట్లు పోలీసులు వివరించారు. ఆధార్​ కార్డులో మోసాలకు పాల్పడుతున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన నలుగురిని అరెస్టు చేసినట్లు వివరించారు. వయస్సు మార్చటం కోసం ఒక్కొక్కరి నుంచి 3 వేల రూపాయలు వసూలు చేసినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details