కరోనాతో మరణించిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్న విజయనగరం యూత్ ఫేస్బుక్ గ్రూప్‌నకు చెందిన ఐదు సేవా వాహనాలను.. వైకాపా జిల్లా వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ప్రారంభించారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కొవిడ్ బాధితులకు, కొవిడ్ మృతులకు విజయనగరం యూత్ ఫేస్బుక్ గ్రూప్ అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు.
విజయనగరంలో సేవా వాహనాలు ప్రారంభం - corona helping in Vijayanagaram
విజయనగరం యూత్ ఫేస్బుక్ గ్రూప్ చేస్తున్న సేవలను వైకాపా జిల్లా వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ప్రశంసించారు. కొవిడ్ బాధితులకు సేవలందించేదుకు ఏర్పాటు చేసిన ఐదు సేవా వాహనాలను ఆయన ప్రారంభించారు.
విజయనగరంలో సేవా వాహనాలు ప్రారంభం
ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన 200 మంది మృతదేహాలను వారి స్వగ్రామాలకు తరలించడంతో పాటు, సుమారు 50 మృతదేహాలకు సొంత ఖర్చులతో అంతిమ సంస్కారాలు చేయడం హర్షణీయమని తెలిపారు.
ఇదీచదవండి.