ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎక్కడ భూములు కనిపించినా గద్దల్లా వాలిపోతున్నారు'

వైకాపా ఎమ్మెల్యేలు, ప్రభుత్వ వ్యవహార శైలిపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ వైకాపా నేతలు గద్దల్లా వాలిపోతున్నారని ఆరోపించారు. కరోనాలోనూ కక్కుర్తి పడి... అంత్యక్రియలకు కూడా రేట్లు పెట్టి వసూళ్లు చేయడం కిరాతకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం పార్లమెంట్ తెదేపా నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

Chandrababu video Conference with Vizianagaram tdp leaders
చంద్రబాబు

By

Published : Oct 10, 2020, 4:03 PM IST

ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ వైకాపా నేతలు గద్దల్లా వాలిపోతున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ప్రతి నియోజకవర్గంలో వైకాపా షాడో ఎమ్మెల్యేలు తయారయ్యారని ఆయన మండిపడ్డారు. విజయనగరం లోక్​సభ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలతో చంద్రబాబు సమీక్షించారు. అక్రమ వసూళ్లు, దందాలు చేస్తూ.. అన్నివర్గాల ప్రజలను వైకాపా నేతలు పీడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేమని ప్రశ్నిస్తే బెదిరింపులు, దాడులకు దిగుతున్నారని దుయ్యబట్టారు.

రాష్ట్రంలో ప్రజల నుంచి 3 రకాల పన్నులు వసూలు చేస్తున్నారన్న చంద్రబాబు... వాటిల్లో మొదటిది జే ట్యాక్స్ అయితే రెండోది వైకాపా ట్యాక్స్ అని, మూడోది ప్రభుత్వం వసూలు చేసే పన్నని ధ్వజమెత్తారు. గత పాలకులు అభివృద్ధిలో పోటీపడి.. కక్షలు పక్కనబెట్టేవారని అన్నారు. చేసిన అభివృద్దిని చెడగొట్టే పాలకులను ఇప్పుడే చూస్తున్నామని అక్షేపించారు. కరోనాలోనూ కక్కుర్తి పడి... అంత్యక్రియలకు కూడా రేట్లు పెట్టి వసూళ్లు చేయడం కిరాతకమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయనగరంలో 55 శాతం ప్రాంతాల్లో పంటలు వేయలేకపోయారన్న చంద్రబాబు... 20 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబర్ రెండో వారంలో కూడా కరవు మండలాల ప్రకటన లేకపోవటాన్ని తప్పుబట్టిన ఆయన... పంటలు తగలబెట్టే పరిస్థితి రైతులకు తెచ్చారని విమర్శించారు.

ఇదీ చదవండి:

మూడు శతాబ్దాలుగా ఆ గ్రామంలో మద్యపాన నిషేధం

ABOUT THE AUTHOR

...view details