ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విగ్రహ ధ్వంసాలపై ప్రభుత్వ చర్యలేవి?: చంద్రబాబు - చంద్రబాబు న్యూస్

జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. విగ్రహ ధ్వంసాలపై ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుందో... చెప్పాలని డిమాండ్ చేశారు.

chandrababu
చంద్రబాబు

By

Published : Jan 1, 2021, 3:07 PM IST

Updated : Jan 1, 2021, 5:00 PM IST

రాష్ట్రంలో దేవాలయాల మీద దాడులు నిత్యకృత్యం కావడం దురదృష్టకరమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వ అలసత్వ తీరు వల్లే ఈ దాడులు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరంలో విఘ్నేశ్వర ఆలయంలో సుబ్రమణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని విధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వరుసగా జరుగుతున్న ఈ దురాగతాల నివారణకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

విజయవాడ దుర్గమ్మ గుడిలో మాయమైన 3 సింహాలను ఇప్పటివరకు గుర్తించలేదని విమర్శించారు. అంతర్వేది రథం తగులబెట్టిన నిందితులను నేటికీ అరెస్ట్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హిందూ ధర్మాలకు, సాంప్రదాయాలకు కళ్లెం పడిందని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేనంతగా రాష్ట్రంలో దేవుళ్లపై దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

రేపు విజయనగరానికి చంద్రబాబు..

చంద్రబాబు రేపు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. రామతీర్థం ఆలయంలో జరిగిన విగ్రహం ధ్వంసమైన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.

ఇదీ చదవండి:

రాముడి విగ్రహం ధ్వంసం కేసును త్వరలోనే ఛేదిస్తాం: ఎస్పీ రాజకుమారి

Last Updated : Jan 1, 2021, 5:00 PM IST

ABOUT THE AUTHOR

...view details