రామతీర్థం ఘటనను నిరసిస్తూ... ఈ నెల అయిదో తేదీన భాజపా, జనసేన ఆధ్వర్యంలో ఛలో రామతీర్థం కార్యక్రమం చేపడతామని ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హాజరవుతారని తెలిపారు. రామతీర్థం సంఘటన జరిగిన తరువాత ముఖ్యమంత్రి జగన్... జిల్లాకు వచ్చి కూడా ఎందుకు మాట్లాడలేదని మాధవ్ విమర్శించారు. దేవాదాయశాఖ మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పోలీసులు... వైకాపా కార్యకర్తలుగా వ్యవహరించారని ఆక్షేపించారు. పుణ్యక్షేత్రం అయిన రామతీర్థంను రాజకీయ క్షేత్రంగా భ్రష్ఠు పట్టిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే దాడికి పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.
రామతీర్థం ఘటనకు నిరసిస్తూ ఈ నెల ఐదో తేదీన చలో రామతీర్థం - vizianagaram latest news
రామతీర్థం ఘటనపై ఎమ్మెల్సీ మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా ఈ నెల అయిదో తేదీన భాజపా, జనసేన ఆధ్వర్యంలో ఛలో రామతీర్థం కార్యక్రమం చేపడతామని తెలిపారు. తక్షణమే దాడికి పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.
![రామతీర్థం ఘటనకు నిరసిస్తూ ఈ నెల ఐదో తేదీన చలో రామతీర్థం Chalo Ramatirtha on the fifth of this month to protest of the Ramatirtha inciden](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10108086-689-10108086-1609694199661.jpg)
రామతీర్థం ఘటనకు నిరసిస్తూ ఈ నెల ఐదో తేదీన చలో రామతీర్థం