ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గిరిజన విశ్వవిద్యాలయ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించిన కేంద్ర బృందం - విజయనగరం తాజా

గిరిజన విశ్వవిద్యాలయానికి ప్రభుత్వం ప్రతిపాదించిన స్థలాన్ని కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ ఉపకులపతి కట్టమణి పరిశీలించారు. అక్కడ కల్పిస్తున్న వసతులపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేటాయించిన స్థలానికి అదనంగా మరో వంద ఎకరాలు కేటాయించాలని చెప్పారు.

central team
గిరిజన విశ్వవిద్యాలయ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించిన కేంద్ర బృందం

By

Published : Jan 8, 2021, 11:14 AM IST

విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటినవలస ప్రాంతంలో విశ్వవిద్యాలయ ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన స్థలాన్ని కేంద్ర గిరజన విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ కట్టమణి, రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర పరిశీలించారు. అక్కడ కల్పిస్తోన్న వసతులపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేటాయించిన స్థలానికి అదనంగా మరో వంద ఎకరాలు కేటాయించాలని, జాతీయ రహదారికి ఆనుకొని ఆ ప్రాంతానికి వెళ్లేమార్గంలో అదనంగా మరో ఏభై ఎకరాలు కేటాయిస్తే మహిళలకు వసతి గృహం, ఆసుపత్రి, క్రీడామైదానం, గ్రంథాలయం వంటివి నిర్మించుకోనేందుకు వీలుగా ఉంటుందని వీసి అన్నారు. యూనివర్సిటీ ఏర్పాటు అయితే ఈ ప్రాంతంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. వారి వెంట సీటీవీ సన్ రాజు, జేసీ కిషోర్ కుమార్, ఐటీడీఏ పీవో కూర్మనాథ్, ఆర్డీవో భవానీశంకర్, సాలూరు గజపతినగరం ఎమ్మెల్యేలు పి.రాజన్నదొర, బి. అప్పలనర్శయ్య పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details