విజయనగరం జిల్లాలోని మెంటాడ, దత్తిరాజేడు మండలాల పరిధిలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని కేంద్ర ఉన్నతాధికారుల బృందం పరిశీలించింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కార్యదర్శి రజనీష్ జైన్, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, కేంద్ర విద్యాశాఖ అండర్ సెక్రటరీ రవిశంకర్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ సర్రాజు, కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ కట్టమణి, రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ రమేష్‌బాబులతో కూడిన కమిటీ చిననాడపల్లి, మర్రివలస గ్రామాల్లో పర్యటించారు.
OBSERVATION: గిరిజన విశ్వవిద్యాలయ స్థలాన్ని పరిశీలించిన కేంద్ర బృందం - tribal university in vizianagaram district
విజయనగరం జిల్లాలో కేంద్ర ఉన్నతాధికారుల బృందం పర్యటించింది. గిరిజన విశ్వవిద్యాలయం కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించింది. యూనివర్సిటీ ఏర్పాటునకు ప్రతిపాదించిన 561ఎకరాల స్థలాన్ని.. స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి భవానీ శంకర్ కేంద్ర బృందం అధికారులకు వివరించారు.
జిల్లాలో కేంద్ర ఉన్నతాధికారుల బృందం పర్యటన
యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రతిపాదించిన 561ఎకరాల స్థలాన్ని.. స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి భవానీ శంకర్ కేంద్ర బృందం అధికారులకు వివరించారు. స్థల పరిశీలన అనంతరం జిల్లా కేంద్రంలోని జడ్పీ అతిథి గృహంలోని కలెక్టర్, జాయింట్ కలెక్టర్లతో భేటీ అయ్యారు.
ఇదీచదవండి.